=

మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

Sanatana Dharm సనాతన ధర్మం  Sanatana Dharm సనాతన ధర్మం  Sanatana Dharm సనాతన ధర్మం
stroms  Srimad Bhagavad Gita  Valmiki Ramayanam

తొలిఏకాదశి, శయన ఏకాదశి, శ్రీగోపద్మ వ్రతారంభం, చాతుర్మాస్య వ్రతారంభము


                     ఆషాఢ శుద్ధ ఏకాదశిని ... తొలి ఏకాదశి అని అంటారు, దీనినే శయనైకాదశి అని కూడా అంటారు. ఈ రోజునుండి పండుగలు మొదలవుతాయి గనుక దీనిని తొలిఏకాదశి అని అంటారు. ఈ రోజు ఉపవాసం ఉండి, భగవంతుణ్ణి భక్తితో పూజిస్తే, గోలోకప్రాప్తి లభిస్తుందట.

                     విష్ణుమూర్తి పాలకడలిలో శేషపాన్పు పై, యోగనిద్రలోకి ప్రవేసించే రోజు ఈ రోజు. (యోగనిద్ర అనేది భూమిపై రాత్రి సమయాలు పెరుగుతాయి అనేదానికి సూచన. దానివలన ప్రజలలో నిద్రాసమయం పెరుగుతుంది.) భగవానుడు దక్షిణవైపు తలపెట్టి, కుడిచేతిమీద పడుకుంటాడు. సూర్యచంద్రులు అతనికి రెండు నేత్రాలు. రెప్పలు మేఘాలు. శయనించుట అనగా సూర్యుని, చంద్రుని కన్నులుగా కలిగిన అతడు---- నిదురించుట అంటే రెప్పలు మూయుట అని అర్థము. అనగా ఆ రోజునుండీ మేఘములచే--సూర్యచంద్రులు కప్పబడతారు. నిజానికి భగవంతుడు నిద్రపోడు. యోగనిద్రలో ఉంటాడు. తిరిగి విష్ణుమూర్తి కార్తిక శుద్ధ ఏకాదశి నాడు యోగనిద్ర నుండి మేల్కొంటాడు. దీనినే క్షీరాబ్ది ఏకాదశి లేదా ఉత్థాన ఏకాదశి అని అంటారు. ఈ నాలుగు నెలలు స్వామి అలసట తీర్చుకొనుటకు యోగనిద్రలోకి వెళ్ళి, భక్తుల పరిరక్షణా భారాన్ని, లోక సంరక్షణా భారాన్ని అమ్మవారికి అప్పగిస్తారు. అందుకే అమ్మవారికి ఈ నాలుగు నెలలు పూజలు ఎక్కువగా జరుగుతాయి. శ్రావణమాసంలో -- శ్రావణలక్ష్మీ రూపంలో, ఆశ్వీయుజ మాసంలో -- శక్తిరూపంలో అమ్మ అందరి పూజలను అందుకుంటుంది. "అమ్మా మా విన్నపాలను స్వామికి తెలుపమ్మా" అని అమ్మకి మన మొరలని తెలియచేసుకునే అవకాశం మనకు లభిస్తుంది.

శాంతాకారం భుజగశయనం, పద్మనాభం, సురేశం
విశ్వాకారం, గగన సదృశం మేఘవర్ణం శుభాంగం
లక్ష్మీకాంతం, కమలనయనం యోగి హృద్ధ్యానగమ్యం
వందే విష్ణుం, భవభయహరం సర్వలోకైక నాధం!!

                       ఏ మంచిపని ప్రారంభించినా దశమి ఏకాదశులకోసం ఎదురుచూడటం ప్రజలకు అలవాటు. ఏడాది పొడుగునా ఉండే 24 ఏకాదశుల్లో, ఆషాఢ శుక్ల ఏకాదశి తొలి ఏకాదశిగా పరిగణిస్తారు.
ప్రతీసంవత్సరం ఆషాడ శుద్ధ ఏకాదశిని 'తొలిఏకాదశి' గా అంటారు. ఎందుచేతనంటే! పూర్వకాలమందు ఈ తోలిఏకాదశితోనే, సంవత్సర ప్రారంభంగా కూడ చూచేవారట! ఈ రోజును 'శయన ఏకాదశి' అనికూడా పిలుస్తారు ఎందువల్లననగా; శ్రీమహావిష్ణువు ఆరోజునుండి కార్తీకశుద్ధ ఏకాదశి వరకు యోగనిద్రలో ఉంటారని, నాటినుండి శ్రీహరిభక్తులు కామక్రోధాధులు వర్జించి ప్రయాణాలు చేయకుండా ఒకేచోట ఉండి శ్రీహరిని అర్చిస్తూ తిరిగి కార్తీకశుద్ధ ఏకాదశి 'ఉత్థాన ఏకాదశి' వరకు
ఆ నాలుగు మాసములు చాతుర్మాస్య వ్రతం చేయుట కూడా మన భారతీయ సంప్రదాయములలో ఒకటి. ఆరోజు 'శ్రీహరి' శేషతల్పం పైనుండి మేల్కొంటారు. ఈ చాతుర్మాస్య దీక్షను సన్యాసులు మాత్రమేకాదు. సంసారులు, వయో, లింగబేధము లేకుండా భక్తులందరూ దీనిని ఆచరిస్తూ ఉంటారు.

ఈ 'తొలి ఏకాదశి' నాడు "గోపద్మ వ్రతం" చేయుట ఎంతో విశిష్టమైనదిగా చెప్తారు.
ఈ గోమాత పూర్తిగా విరాట్ పురుషుని రూపంతో పోల్చబడింది.
గోవునకు ముఖమునందు వేదాలు, కొమ్మలయందు హరిహరులు, కొమ్ముల చివర ఇంద్రుడు, లలాటమున ఈశ్వరుడు, కర్ణములందు అశ్వనీదేవతలు నేత్రములందు సూర్యచంద్రులు, దంతములయందు గరుడుడు, జిహ్వయందు సరస్వతి, ఉదరమునందు స్కందుడు, రోమకూపములందు ఋషులు, పూర్వభాగమునందు యముడు, పశ్చిమ భాగమునందు అగ్ని, దక్షిణభాగమున వరుణ కుబేరులు, వామభాగము నందు యక్షులు, ముఖమునందు గంధర్వులు, నాసాగ్రమందు పన్నగలు, అపానంబున సరస్వతి, గంగాతీర్థంబులు, గోమయంబున లక్ష్మీ,

          పాదాగ్రంబున ఖేచరులును, అంబా అంటూ అరచే అరుపులో ప్రజాపతి, స్థనములందు చతుస్సాగరములు ఉన్నట్లుగా వర్ణింపబడెను. కావున గోవును పూజిస్తే! సమస్త దేవతలను పూజించి నట్లేనని, సమస్త తీర్థములలో పుణ్యస్నానంచేసిన పుణ్యఫలం లభిస్తుందని 'గోమాతకు' ఇంత పూజ్యస్తానమిస్తూ, అధర్వణ వేదంలో బ్రహ్మాండపురాణంలో, మాహాభారతంలో, పద్మపురాణంలో ఇలా ఎన్నో గాధలు ఉన్నాయి.
                             అట్టి గోమాత నివశించే గోశాలను ఈ 'తొలిఏకాదశి' దినమందు మరింతగా శుభ్రముచేసి అలికి ముత్యాల ముగ్గులతో రంగవల్లికలను తీర్చిదిద్ది గోశాల మధ్యభాగమందు బియ్యపు పిండితో ముప్పైమూడు పద్మాల ముగ్గులు పెట్టి, శ్రీమహాలక్ష్మీ సమేత శ్రీమహావిష్ణువు ప్రతిమను ఆపద్మములపైనుంచి, వారిని విధివిధానంగా పూజించి, పద్మానికి ఒక్కొక్క "అప్పడాన్ని" వాటిపై ఉంచి ఆ అప్పడాలను వాయనాలను, దక్షిణ తాంబూలాదులలో బ్రాహ్మణుని సంతుష్టుని గావించి, గోమాతను పూజించువార్కి సకలలాభీష్టములు తప్పక నెరవేరుతాయని చెప్పబడినది. అలా, గోపద్మవ్రతం చెయ్యాలి.
ఇంత పుణ్యప్రదమైన తొలిఏకాదశి పర్వదినం శుభప్రదముగా జరుపుకుందాము.

                       సూర్యుడు కర్కాటకరాశిలోకి ప్రవేశించటంతో దక్షిణాయనం ప్రారంభమవుతుంది. ఈ కాలంలో సరైన సూర్యరశ్మి లేక, వర్షాభావం వలన, మానవులు అనేక వ్యాధులబారిన పడతారు. అందుకే మన పెద్దలు ఈ నాలుగు నెలలు చాతుర్మాస దీక్ష, నోములు, వ్రతాలూ అని చెప్పి, ఉపవాసములు చెయ్యమని, ఆహరనియమాలను పాటించమని, ఆ ప్రకారం నడుచుకుంటే మనకు పుణ్యం లభిస్తుంది అనితెలియచేసారు.


శయన ఏకాదశి

www.sanatanadharm.com - play store app (sanatana dharm)  

"Bharathiya Sanatana Dharmam" and Sanatana Dharm & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. 2019-2025 Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.